రాజధాని..రియల్ ఎస్టేట్ మార్కెట్ కు స్పష్టత
ఎక్కువ మంది అంచనా వేస్తున్నట్లు...ప్రచారంలో ఉన్న విధంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అమరావతి తో పాటు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒకింత బూమ్ కు ఛాన్స్ ఉంటుంది అని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే హైప్ క్రియేట్ చేయటంతో పాటు మార్కెట్ చేయటంలో చంద్రబాబు స్టైల్ ఉపయోగపడుతుంది అని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. మరో కీలక విషయం ఏమిటి అంటే కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తన తొలి టర్మ్ లో చేసిన తప్పు మళ్ళీ చేయకుండా అమరావతి లో కీలక నిర్మాణాలు అన్ని పూర్తి చేస్తారు అని టీడీపీ వర్గాలు కూడా చెపుతున్నాయి. ఎవరు అదికారంలో ఉన్నా కూడా రాజధాని ని కదిలించకుండా పనులు పూర్తి అవుతాయి అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. వైసీపీ అధినేత, సీఎం జగన్ చెపుతున్నట్లు ఈ ఎన్నికల్లో కూడా తిరిగి వైసీపీ గెలిస్తే రియల్ ఎస్టేట్ ఫోకస్ అంతా కూడా వైజాగ్ తో పాటు పూర్తిగా ఉత్తరాంధ్ర వైపు మళ్లటం ఖాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ తిరిగి అధికారంలోకి వస్తే న్యాయపరమైన చిక్కులు తొలగించి వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో పాటు మూడు రాజధానుల ను అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఫలితాల కోసం రియల్ ఎస్టేట్ రంగంలోని వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 న వచ్చే ఫలితాలతో అటు రాజధానితో పాటు రియల్ ఎస్టేట్ కు ఒక స్పష్టత రానుంది అనే చెప్పాలి.