Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
X

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే విద్యా రంగం కోలుకుంటోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఎన్ని చేసినా విద్యా సంవత్సరంలో, పరీక్షల షెడ్యూల్ లో భారీ మార్పులు అనివార్యం అవుతున్నయి. బుధవారం నాడు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా..

జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌

జూన్‌ 10(గురువారం) : గణితం

జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌

జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌

జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

Next Story
Share it