Telugu Gateway
Andhra Pradesh

కరోనాతో అనాథలైన పిల్లల ఖాతాల్లో పది లక్షలు

కరోనాతో అనాథలైన పిల్లల ఖాతాల్లో పది లక్షలు
X

ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పిల్లలు అనాథలుగా మారితే వారి ఖాతాల్లో పది లక్షల రూపాయలు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఎక్కడైనా తల్లి,తండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ తెలిపారు. ఆ మేరకు తదుపరి ఉత్తర్వులను రేపు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నమని సింఘాల్ పేర్కొన్నారు. వారికి 25ఏళ్లు వచ్చేవరకూ ఫిక్స్‌ డ్‌ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పిల్లలకు వారికి 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేశారు.

Next Story
Share it