Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు రాత్రి తొమ్మిది వ‌ర‌కూ

ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు రాత్రి తొమ్మిది వ‌ర‌కూ
X

ఏపీ స‌ర్కారు క‌ర్ఫ్యూ స‌డ‌లింపుల్లో మ‌రింత వెసులుబాటు కల్పించింది. అయితే ఇది పాజిటివిటి రేటు ఐదు శాతం దిగువ‌న ఉన్న జిల్లాల్లో మాత్ర‌మే. సీఎం జ‌గ‌న్ సోమ‌వారం నాడు రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలోనే ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. కొత్త‌గా ఏపీలో ఎనిమిది ఎజిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు చేయాల‌ని నిర్ణ‌యించారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లోనే ఈ సడలింపు ఉంటుంది. ఇక్క‌డ ఉదయం ఆరు గంట‌ల నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు. రాత్రి 9 నుంచి మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయాల్సి ఉంటుంది.

రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ కొన‌సాగుతుంది. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే క‌ర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ ఎప్ప‌టిలాగానే అమ‌లు అవుతుంది. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త స‌డ‌లింపులు జులై 1 నుంచి జులై 7 వరకూ అమ‌ల్లో ఉంటాయి. ఆ త‌ర్వాత ప‌రిస్థితిని స‌మీక్ష చేసి నిర్ణ‌యం తీసుకుంటారు. అప్ప‌టి ఆయా జిల్లాల్లో ఉన్న క‌రోనా పాజిటివిటీ రేటు పరిశీలించాక ఆయా జిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకుంటారు..

Next Story
Share it