Telugu Gateway
Andhra Pradesh

కారణం ఏంటో తెలుసా?

కారణం ఏంటో తెలుసా?
X

ఆంధ్ర ప్రదేశ్ లోని ఉద్యోగులు..పెన్షనర్లు బుధవారం నాడు ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. తాము ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనేనా ..లేక తమకు ఏమైనా కల వచ్చిందా అని ఒకసారి తమను తాము గిల్లి చూసుకున్నారు. పెరిగిన ఎండల దెబ్బకు తమపై ప్రభావం ఏమైనా పడిందా అని మరో సారి చెక్ చేసుకున్నారు. కానీ కాస్త తేరుకుని చెక్ చూసుకుంటే అదేమీ కాదు. వాళ్లకు కనిపించింది అంతా నిజమే. ఏంటి ఈ నిజం అనుకుంటున్నారా?. అవును వాళ్లకు ఎంతో కాలం తర్వాత..మరో మాటలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఉద్యోగులకు ఫస్ట్ తారీకు వేతనాలు పడ్డాయి. అది కూడా మే డే బ్యాంకు సెలవు ఉన్నా కూడా వాళ్ళ ఖాతాల్లో జీతాలు జమ కావటంతో చాలా మంది ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి. ఉద్యోగులకు జీతాలే కాదు..పెన్షనర్లకు పెన్షన్ కూడా ఫస్ట్ రోజే వాళ్ళ ఖాతాల్లో జమ అయింది. ఇది చుసిన వాళ్ళు అంతా ఆహా ..ఏమి భాగ్యం..ఎంతకాలానికి ఇలా ఫస్ట్ తారీకు రోజు తమ జీతాల మెసేజ్ లతో ఫోన్లు మోగాయి అని ఆనందపడిపోయారు. ఈ అద్భుతం జరగటానికి ప్రధాన కారణం పాలన అంతా ఇప్పుడు ఎన్నికల సంఘం చేతుల్లో ఉండటమే అని చెప్పొచ్చు.

పైగా ఎన్నికల వేళ కనీసం ఒక్క నెలలో అయినా ఉద్యోగుల కళ్ళల్లో అందం చూస్తే అది తమకు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు అని కూడా జగన్ సర్కారు భావించి ఉండొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కారు కొలువు తీరిన తర్వాత ఉద్యోగులకు వేతనాలు ఫస్ట్ తారీఖున రావటం అన్నది ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇది ఒక్కటే కాదు...వాళ్లకు చట్టబద్ధంగా అందాల్సిన అనేక సౌకర్యాలు కూడా కట్ అయ్యిపోయాయి. సకాలంలో వేతనాల కోసం ఉద్యోగులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి కలిపించింది జగన్ ప్రభుత్వం. దీనిపై కొంత మంది మంత్రులు అయితే ...నెలలో ఉప్పడో ఒకసారి జీతాలు ఇస్తున్నాం కదా అంటూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. చేసిన ఉద్యోగానికి సకాలంలో జీతాలు ఇవ్వాలని అడగటం కూడా తప్ప అంటూ అంటూ ఉద్యోగ సంఘాలు గతంలో ప్రభుత్వ తీరుపై అభ్యన్తరం వ్యక్తం చేశాయి. కారణాలు ఏమైనా జగన్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో వ్యవహరించిన తీరు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించటం ఖాయం అనే అభిప్రాయం సర్వత్రా ఉంది.

Next Story
Share it