Telugu Gateway
Andhra Pradesh

ఇద్దరికీ ఎక్కడ తేడా వచ్చిందో!

ఇద్దరికీ ఎక్కడ తేడా వచ్చిందో!
X

ఆంధ్ర ప్రదేశ్ లో ఆ మంత్రి గతంలో ఎన్నడూ లేని రీతిలో అవినీతికి పాల్పడుతున్నారా?. ఇదే విషయం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లిందా....ఇది తెలిసిన తర్వాతే ఆయన ఇప్పుడు ఆ మంత్రి పేరు ఎత్తితే మండి పడుతున్నారా?. అంటే అవుననే చర్చ సాగుతోంది ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార, రాజకీయ వర్గాల్లో. ఆ మంత్రి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పనులు చెప్పినట్లు చేసేవాళ్ళు అని...కానీ ఈ సారి మాత్రం అందుకు బిన్నంగా పెద్ద ఎత్తున సొంత దుకాణం తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు రాజధాని అమరావతికి సంబంధించిన సిఆర్ డీఏ అవినీతికి కేంద్రంగా మారిందే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిఆర్ డీఏ లో ఒక కీలక ఇంజనీర్ అంతా ఆ మంత్రి చెప్పినట్లే వింటూ మొత్తం వ్యవహారాలకు ఆయనే రింగ్ మాస్టర్ గా మారారు అని చెపుతున్నారు.

ఒక వైపు ప్రభుత్వ పెద్దల స్థాయిలోనే అమరావతిలో ఏ పనిని ఎవరికీ ఇవ్వాలి...ఎంత కు ఇవ్వాలి అనే విషయాన్ని ఫిక్స్ చేసినట్లు గతంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎంపిక చేసిన కంపెనీలకు మాత్రమే రాజధాని అమరావతి లో వేల కోట్ల రూపాయల పనులు అప్పగించి...ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అవి చాలవు అన్నట్లు ఇప్పుడు మంత్రి సొంతంగా అవినీతి దందా సాగిస్తుండంతో ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఆ మంత్రి ఇప్పుడు వ్యవహారాలు అన్ని తన టీం తోనే నడిపిస్తున్నారు అని...దీని కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు చెపుతున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో దిద్దుబాటు చర్యలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇది ఎంత మేర కార్యరూపం దాల్చుతుందో చూడాలి అనే అనుమానాలు కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

రాజధానిలో అవినీతికి సిఆర్ డీఏ బిల్డింగ్ పనులు కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని అధికార వర్గాలు చెపుతున్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై విచారణ జరిపిస్తే ఇందులో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో బయటపడుతుంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఫస్ట్ టర్మ్ లోనే సగానికి పైగా పూర్తి అయిన ఈ బిల్డింగ్ అంచనాలు భారీగా పెంచి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడినట్లు చెపుతున్నారు. రాజధానికి చెందిన పనుల్లో ముందే అంచనాలు అడ్డగోలుగా పెంచారు అనే ఆరోపణలు ఉంటే...ఇవి చాలవు అన్నట్లు అమరావతిలో కొన్ని పనులకు సంబంధించి ..ముఖ్యంగా విద్యుత్ పనుల్లో నిబంధనలు ఉల్లఘించి మరీ అధిక ధరలకు అనుమతులు ఇచ్చారు. దీని ద్వారా ప్రభుత్వం తాను జారీ చేసిన ఉత్తర్వులను తానే ఉల్లఘించింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన క్యాబినెట్ ను చంద్రబాబు సర్కారు అక్రమాల ఆమోదానికి...కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవటానికి వాడుకుంటోంది అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story
Share it