Telugu Gateway
Andhra Pradesh

మొన్న రోజా..నేడు ఆనం

మొన్న రోజా..నేడు ఆనం
X

అధికార వైసీపీలో ఏమి జరుగుతోంది. సీనియర్ నేతలను అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకే ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీని వెనక సొంత పార్టీలో నేతల పాత్ర ఉందా? కావాలని టార్గెట్ చేసిన వారినే ఇలా పక్కన పెడుతున్నారా?. ఇది వైసీపీలో సాగుతున్న చర్చ. కొద్ది రోజుల క్రితమే వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆర్ కె రోజా తనకు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎవరూ గౌరవం ఇవ్వటంలేదని, కనీసం తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించటం లేదంటూ ప్రివిలైజ్ కమిటీ వద్ద వాపోయారు. అంతే కాదు ఆమె ఈ అంశంపై విలపించారు కూడా.

తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది. దీంతో నెల్లూరు జిల్లా అధికారులపై వెంకటగిరి వైసీపీ నేత ఆనం రామ్‌నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో రిపబ్లిక్ డే పరేడ్ జరిగితే ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదన్నారు. ప్రభుత్వ గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదని ఎమ్మెల్యే ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అర్హత లేదా? దీనికి మేము సిగ్గుపడాలో, ఏంచేయాలో అర్థం కావడంలేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన కుండా ఆవమానించిన అధికారులపై కేసులు వేస్తానని పేర్కొన్నారు.

Next Story
Share it