చంద్రబాబుకు అమిత్ షా ఫోన్
BY Admin27 Oct 2021 8:37 PM IST

X
Admin27 Oct 2021 8:37 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో బుధవారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. వాస్తవానికి ఢిల్లీలో ఆయన అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేయగా..ఏపీలో పరిస్థితులు..తాము చేయదలచుకున్న ఫిర్యాదుల కాపీలను పంపనున్నట్లు చంద్రబాబు ఆయనకు తెలిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందని, టీడీపీ కార్యాలయంపై , టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర విషయాలను అమిత్ షాకు చంద్రబాబు తెలిపారు. ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడినా దాని మూలాలు ఏపీకి రావడం, ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు వివరించారని ఆ వర్గాలు తెలిపాయి.
Next Story