Telugu Gateway
Andhra Pradesh

ఐదు టవర్ల కు టెండర్లు పిలిచిన సిఆర్ డీఏ

ఐదు టవర్ల కు టెండర్లు పిలిచిన సిఆర్ డీఏ
X

ఆంధ్ర ప్రదేశ్ కొత్త సచివాలయం ఐదు టవర్ల లో రానుంది . జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయం 1126 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్, హెచ్ఓడీ ఆఫీసుల పేరుతో మొత్తం ఐదు టవర్లు నిర్మించనున్నారు. సచివాలయంలో భాగంగా నిర్మించే టవర్ 1 , 2 ల నిర్మాణ వ్యయం 1897.86 కోట్లు, టవర్ 3 , 4 ల నిర్మాణ వ్యయం 1664 కోట్ల రూపాయలుగా సిఆర్ డీఏ బుధవారం నాడు పిలిచిన టెండర్ల లో పేర్కొంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించనున్న ఈ ఐదు టవర్లు కలుపుకుంటే మొత్తం నిర్మాణ వ్యయం 4668 .82 కోట్ల రూపాయలు కానుంది .

రాజధాని అమరావతి లో కీలక భవనాలకు చెందిన చివరి టెండర్లు ఇవే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ, హై కోర్ట్ భవనాల కోసం టెండర్లు పిలిచి పనులు కూడా నిర్మాణ సంస్థలకు అప్పగించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కాంట్రాక్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కి దక్కింది . 617 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేయనున్నారు. నూతన హై కోర్ట్ కాంట్రాక్టు ను ఎన్ సిసి దక్కించుకుంది. హై కోర్ట్ నిర్మాణ వ్యయం 786 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ లెక్కన సచివాలయం ఐదు టవర్ల తో పాటు అసెంబ్లీ, హై కోర్ట్ భవనాలకు కలుపుకుంటే కీలక భవనాల కే 6092 కోట్ల రూపాయల వ్యయం కానుంది. మే 1 న నూతన సచివాలయం టవర్ల నిర్మాణానికి సంబదించిన టెక్నీకల్ బిడ్స్ ఓపెన్ చేస్తారు. కాంట్రాక్టు సంస్థలు బిడ్ దాఖలు చేయటానికి కూడా అదే చివరి తేదీగా నిర్ణయించారు.

Next Story
Share it