Telugu Gateway
Andhra Pradesh

క్యాబినెట్ ఆమోదమే తరువాయి

క్యాబినెట్ ఆమోదమే తరువాయి
X

ఎట్టకేలకు అమరావతి ఐకానిక్ టవర్ల టెండర్లు ఖరారు అయ్యాయి. మే మొదటి వారంలో పూర్తి కావాల్సిన ఈ ప్రక్రియ తాజాగా ఒక కొలిక్కి వచ్చింది. అధికారికంగా బిడ్స్ దక్కించుకున్న సంస్థలకు లెటర్ అఫ్ అవార్డు (ఎల్ఓఏ) ఇవ్వటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మంగళవారం నాడు జరిగిన సమావేశంలో వీటిని ఓకే చేశారు. అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఐకానిక్ టవర్స్ లో జీఏడీ బ్లాక్ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి దక్కించుకుంది. ఈ టవర్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 1126 కోట్ల రూపాయలుగా ఉంది. రెండు టవర్ల నిర్మాణ బాధ్యతను మరో ప్రముఖ సంస్థ ఎన్ సిసి దక్కించుకుంటే...మిగిలిన రెండు టవర్ల నిర్మాణ కాంట్రాక్టు షాపూర్జీ పల్లోంజీ సంస్థకు దక్కినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రెండు టవర్ల నిర్మాణ బాధ్యతను బెంగళూరు కు చెందిన సంస్థకు కట్టబెట్టాలని చూసినా కూడా ఆ కంపెనీ బిడ్ కెపాసిటీ సమస్య కారణంగా రేస్ లో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని చెపుతున్నారు. అయినా సరే మరో రూపం లో ఆ సంస్థకే ఆ టవర్ నిర్మాణ బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ముందు నుంచి ప్రచారం జరిగినట్లు అంతా ఒక ప్లాన్ ప్రకారమే ఈ పనులు పంపీణీ చేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. దక్కిన పనులు చూస్తేనే ఈ విషయం స్పష్టం అయింది అని చెప్పొచ్చు.

ఏపీసిఆర్ డీఏ గత నెలల్లో ఈ ఐదు టవర్ ల నిర్మాణాన్ని టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయం 1126 కోట్ల రూపాయలుగా ఉంది. సచివాలయంలో భాగంగా నిర్మించే టవర్ 1 , 2 ల నిర్మాణ వ్యయం 1897.86 కోట్లు, టవర్ 3 , 4 ల నిర్మాణ వ్యయం 1664 కోట్ల రూపాయలుగా ఉంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించనున్న ఈ ఐదు టవర్లు కలుపుకుంటే మొత్తం నిర్మాణ వ్యయం 4668 .82 కోట్ల రూపాయలు కానుంది. అయితే ఈ పనులను ఆయా సంస్థలు అధిక ధరకు కోట చేసి దక్కించుకున్నాయా లేక లెస్ వేసాయా అన్నది తెలియాలి అంటే జీవో లు వస్తే కానీ తేలదు. సిఆర్డీఏ అథారిటీ ముందు ఈ వివరాలు ఈ టెండర్లను అధికారికంగా ఓకే చేశాక..క్యాబినెట్ ఆమోదం పొందనున్నారు. తర్వాత దీనికి సంబదించిన జీవో లు వెలుఁడతాయి.

Next Story
Share it