Telugu Gateway
Andhra Pradesh

పవన్ కు అభినందనలు తెలిపిన ఐకాన్ స్టార్

పవన్ కు అభినందనలు తెలిపిన ఐకాన్ స్టార్
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సృష్టించిన ప్రభంజనంలో అల్లు అర్జున్ ఫ్రెండ్, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ఫా రవిచంద్రా రెడ్డి ఓటమి పాలు అయ్యారు. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు ఎక్స్ వేదికగా మద్దతు పలికిన అల్లు అర్జున్ తన స్నేహితుడు అయిన శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం ఏకంగా నంద్యాల వెళ్లి మరీ సంఘీభావం ప్రకటించి వచ్చారు. అప్పటిలో ఇది పెద్ద దుమారమే రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదంలోకి నాగ బాబు ఎంట్రీ ఇచ్చి చేసిన ట్వీట్ పెద్ద కలకాలమే రేపింది. మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగ బాబు పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ దెబ్బకు నాగ బాబు కొన్ని రోజులు ట్విట్టర్ కు దూరంగా కూడా ఉన్న విషయం తెలిసిందే.

తర్వాత ఈ ట్వీట్ తొలగించినట్లు నాగ బాబు ప్రకటించారు. ఎన్నికల్లో అల్లు అర్జున్ సంగీభావం తెలిపిన నంద్యాల వైసీపీ అభ్యర్థి ఓడి పోవటం తో ఈ విషయం మరో సారి చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై అల్లు అర్జున్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేసిన కఠోర శ్రమ, అంకితభావం తో చేసిన పనులు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయన్నారు. ప్రజల సేవ చేసే మీ కొత్త ప్రయాణానికి నా శుభాకంక్షాలు అని పేర్కొన్నారు.

Next Story
Share it