ఆహా.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు

ఇంట్రెస్టింగ్. ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో బాలకృష్ణ కూడా హోస్ట్ గా అందరినీ ఆకట్టుకున్నారు. విచిత్రం ఏమిటంటే పలు విషయాల్లో బాలక్రిష్ణను తీవ్రంగా విమర్శించే వారు కూడా ఈ షో విషయంలో మాత్రం బాలక్రిష్ణకే అనుకూలంగా మార్కులు వేశారు. ఈ నెల నుంచే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ఆహా ప్రకటించింది. అయితే ఇందులో ఈ సారి ఎవరెవరు పాల్గొంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సెకండ్ సీజన్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.
మంగళవారం నాడే అన్నపూర్ణ స్టూడియోలో చంద్రబాబుతో బాలక్రిష్ణ ఈ షూటింగ్ పూర్తి చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరూ వియ్యంకులు అన్న సంగతి తెలిసిందే. మరి ఈ షోలో బాలకృష్ణ తొలి సీజన్ లో అడిగినట్లే చంద్రబాబును కూడా సరదా ప్రశ్నలు వేస్తారా..లేక సీరియస్ గా సాగుతుందా అన్నది వేచిచూడాల్సిందే. అయితే బాలకృష్ణ ఎంత సరదాగా అడిగినా చంద్రబాబు మాత్రం అంతే సీరియస్ గా చెబుతారనే విషయం తెలిసిందే. మొత్తానికి ఆహా..అన్ స్టాపబుల్ సీజన్ లో 2 ఈ షో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుందనటంలో సందేహం లేదు. మరి వీళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు... బాలకృష్ణ ఏమి అడిగారు..చంద్రబాబు ఏమి చెప్పారు అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.