Telugu Gateway
Andhra Pradesh

విద్యా విష‌యంలో రాజ‌కీయాలు వ‌ద్దు

విద్యా విష‌యంలో రాజ‌కీయాలు వ‌ద్దు
X

క‌రోనా కేసులు పెరుగుతున్నా కూడా ఏపీ ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించ‌టంపై టీడీపీ, జ‌న‌సేన‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ సెల‌వులు పొడిగించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విమ‌ర్శ‌లపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్పందించారు. పాఠశాలల్లో టీచర్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని చెప్పారు. విద్యార్ధుల భ‌విష్య‌త్ ను దృష్టి లో ఉంచుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

15 ఏళ్లు దాటిన పిల్లలకు 95 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై లోకేష్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని త‌ప్పుప‌ట్టారు. ప్రతిపక్షాలు ఏ అంశమూ దొరక్క విద్యా వ్యవస్థ రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. విద్యార్దుల ఆరోగ్యంపై త‌ల్లిదండ్రులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కోవిడ్ వ్యాప్తికి, పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధం లేద‌ని వ్యాఖ్యానించారు.

Next Story
Share it