Telugu Gateway
Andhra Pradesh

ఆ సంపాదకుడి స్టయిలే వేరు!

ఆ సంపాదకుడి స్టయిలే వేరు!
X

ఆయన ఒక ప్రముఖ తెలుగు పత్రిక సంపాదకుడు. సంపాదకుడు పేరును సార్ధకం చేసుకునేలా సంపాదనలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ సాదించలేనన్ని రికార్డులు సాధిస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక్క సంపాదనలోనే కాదు...సంపాదించింది బహిర్గతం అయినా కూడా ఏ మాత్రం డోంట్ కేర్ అనకుండా జాలీ గా ఎంజాయ్ చేస్తున్నారు. విలాసవంతమైన కార్లతో యాజమాన్యం ముందు కూడా తన దర్జాలు చూపించుకోగలుతున్నారు అంటే ఆయన ఎంత ఘటికుడో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆయన ఎక్కడ పని చేసినా కూడా అధికారంలో ఉన్న వాళ్ళతో కూడా అత్యంత సన్నిహితంగా ఉండగలడు. అతని టాలెంట్ చూసి ఆ పత్రికలో పని చేస్తున్న వాళ్ళు అంతా అవాక్కు అవుతున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సంపాదకుడుగా ఉన్న ఆ వ్యక్తి కొద్ది నెలల క్రితం చిత్తూర్ జిల్లా...తిరుపతి కి సమీపంలో ఉండే రాజంపేట ఏరియా లో ఏకంగా 43 కోట్ల రూపాయల వ్యయంతో 90 నుంచి 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇవి ఎక్కువ బినామీ డీల్స్ రూప్యంలోనే జరిగాయి అని ...మరి కొన్ని బంధువుల పేర్లతో కూడా చేయించుకున్నట్లు చెపుతున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ, మీడియా సర్కిల్స్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆయన పని చేసే పత్రికతో సంబంధము లేకుండా అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉండటం ఆయన టాలెంట్ ను చూపిస్తుంది అని ఒక టీడీపీ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే అది నేరుగా కాకుండా కొంత మంది ఐఏఎస్ ల ద్వారా సదరు సంపాదకుడు కథ అంతా నడిపిస్తున్నట్లు ఆ మంత్రి వెల్లడించారు. అందుకే ఏపీ ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలకు సంబంధించిన చాలా విషయాలు బయటకు రాకుండా కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు అనే ప్రచారం అధికార పార్టీ నేతల్లో ఉండటం విశేషం. ఒక్క ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో పలు చోట్ల ఆయన గతంలో కూడా విలువైన భూములు దక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు చెపుతున్నారు.

Next Story
Share it