ష‌ర్మిల పార్టీలో క‌ల‌క‌లం

Update: 2021-07-30 10:45 GMT

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అప్పుడే అల‌క‌లు..రాజీనామాలు మొద‌ల‌య్యాయి. వైఎస్ఆర్ టీపీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి ప్రతాప్‌రెడ్డి పంపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్ఆర్ టీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. తాను రాజీనామా చేయడానికి రాఘవరెడ్డి కారణమని చెబుతున్నారు.

షర్మిల పార్టీలో పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పార్టీ పదవులు ఐదు లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని నర్సింహారెడ్డి ఆరోపించారు. తాను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నాన‌ని, ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో త‌న‌ దగ్గర ఆధారాలు ఉన్నాయ‌న్నారు.

Tags:    

Similar News