జగన్ కు ఓట్లు ఎందుకు వేస్తారు?

Update: 2021-01-19 10:49 GMT

రాష్ట్రం గుండాలకు అడ్డాగా మారింది

ఓ మంత్రి ఇంటికొచ్చి కొడతామని బెదిరిస్తారా?

ఎమ్మెల్యే ఎస్పీని బెదిరిస్తే ఏమీ అనరా?

చంద్రబాబు విమర్శలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు మింగేస్తున్న పార్టీకి ఓటేస్తారా ఎవరైనా..? టిడిపి హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వేధించే వైసిపికి ఓటేస్తారా..? ముంపు భూములు, స్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? నెలకు రూ 750 పించన్ ఎగ్గొట్టిన పార్టీకి పించన్ల లబ్దిదారులు ఎవరైనా ఓటేస్తారా..? మీటర్లు పెట్టే పార్టీకి ఏ ఒక్క రైతు అయినా ఓటేస్తారా..? రైతు భరోసా ఏడాదికి రూ 6వేలు ఎగ్గొట్టిన పార్టీకి ఏ రైతు అయినా ఓటేస్తారా..? హార్టీ కల్చర్ సబ్సిడి ఎగ్గొట్టిన వైసిపికి ఉద్యాన రైతులు ఓటేస్తారా..? పరిశ్రమలు, ఉద్యోగాలు పోగొట్టిన పార్టీకి యువతరం ఎవరైనా ఓటేస్తారా..? అత్యాచారాల రాష్ట్రంగా ఏపిని చేసిన వైసిపికి మహిళలు ఎవరైనా ఓటేస్తారా..? బిసి, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటిలపై దాడులు చేసే పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటేస్తారా..?' అని ప్రశ్నించారు. వీటన్నింటినీ వివరించి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ నేతలను కోరారు.

జగన్మోహన్ రెడ్డి శిశుపాలుడిని మించిపోయాడు. 20నెలల్లోనే వందలాది తప్పులు చేశాడు.. వైసిపి పతనానికి తిరుపతి ఉప ఎన్నికతో నాంది పలకాలి. తిరుపతి నుంచే వైసిపి దాడులకు అడ్డుకట్ట పడాలి. హింసా విధ్వంసాలను వెంకటేశ్వర స్వామి సహించడు. తిరుపతిలో టిడిపి గెలుపుతో వైసిపి విధ్వంసకాండకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఆయన మంగళవారం నాడు పలు అంశాలపై మాట్లాడారు. ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమాను అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమా అరెస్ట్‌ ముమ్మాటికీ అక్రమమేనని అన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్‌ చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. భౌతిక దాడులకు దిగుతామన్న మంత్రిపై చర్యలేవని ప్రశ్నించారు. జగన్‌ది ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూర స్వభావమని అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే ఎస్పీని బహిరంగంగా బెదిరించాడని, ఇవాళ ఇంటికొచ్చి కొడతామంటూ ఓ మంత్రి బెదిరిస్తున్నాడని, కొడాలి నాని, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News