ఉత్కంఠ వీడుతోంది. ఎవరు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారో క్లారిటీ వస్తోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టులను ఆశ్రయించే పనిలో బిజీగా ఉన్నారంటనే అర్ధం అయిపోతుంది. ఎవరు గెలవబోతున్నారో. జో బైడెన్ మాత్రం ట్రంప్ ప్రయత్నాలను అడ్డుకునే పనులు తమ బృందాలకు అప్పగించి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మ్యాజిక్ ఫిగర్ అయిన 270 ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జో బైడెన్ ఇఫ్పటికే 264 ఓట్లు సాధించారు. మరో ఆరు ఓట్లు వస్తే చాలు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయినట్లే. ఇప్పటివరకూ 45 రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడి కాగా..ఇంకా కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే ఇక్కడ పోరు కూడా హోరాహోరీగా సాగుతోంది. ఇంకా ఫలితాలు వెల్లడించాల్సిన రాష్ట్రాల్లో అరిజోనా, పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, నెవడాలు ఉన్నాయి. తాజాగా జో బైడెన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''మనం విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది. ఆ విజయం నా ఒక్కడిదే కాదు. అది అమెరికా ప్రజల విజయం'' అని పేర్కొన్నారు.
''.ఎన్నికల ఫలితాలను డొనాల్డ్ ట్రంప్ కానీ.. నేను కానీ, నిర్ణయించలేము. అమెరికా ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు. అందుకే మేము బైడెన్ ఫైట్ ఫండ్‌ను తీసుకొచ్చాం. ప్రతీ ఓటు పరిగణలోకి వస్తుంది. ఫండ్‌ను దేశవ్యాప్తంగా ఎన్నికల పరిరక్షణ చర్యలకోసం వినియోగిస్తాం '' అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం 264 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ సొంతం చేసుకున్నారు. మరో 6 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే ఆయన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంటారు. ట్రంప్ అధ్యక్ష పదవి రేస్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. 214 ఓట్ల వద్దే ఆగిపోయారు. కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో బైడెన్ విజయంపై స్పష్టత రావటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోగానే ఆయనకు కావాల్సిన ఏడు ఓట్లు వచ్చేస్తే మాత్రం స్పష్టత వచ్చినట్లే.