కాంగ్రెస్ పార్టీపై కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-11-16 06:20 GMT

కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మరోసారి పార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పలితాలు, పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వాస్తవాలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాదులు మనం క్షీణదశలో ఉన్నామనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా భావించటం లేదని తెలిపారు.. కమ్యూనికేషన్ విప్లవం వచ్చిన తర్వాత ఎన్నికలు అధ్యక్ష ఎన్నికల తరహాగా మారిపోయాయని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ సిబాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ లోనే కాదు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రజలు కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా చూడటంలేదన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ అభ్యర్ధులు ముగ్గురు ఏకంగా డిపాజిట్లు కూడా కోల్పోయారని తెలిపారు. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకుంటుందనేది గోడ మీద రాతగా మారిందని అన్నారు.

Tags:    

Similar News