జమిలి ఎన్నికలకు మేం రెడీ

Update: 2020-12-21 16:01 GMT

గత కొంత కాలంగా దేశంలో జమిలి ఎన్నిక నినాదం జోరుగా విన్పిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖచ్చితంగా జమిలి ఎన్నికలు జరగాల్సిందేనని..దీనికి మార్గాలు అన్వేషించాల్సిందిగా ప్రిసైడింగ్ అధికారులను కోరారు. దేశంలోని ప్రధాన పార్టీలు కూడా దేశంలో జమిలి ఎన్నికలకు ఛాన్స్ ఉందని నమ్ముతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాలో కూడా పార్టీలు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు.

జమిలి ఎన్నికలకు తాము రెడీ అని ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు చట్టాలకు కొన్ని సవరణలు చేయాల్సి ఉందని తెలిపారు. కేంద్రం ఎన్నికల నిర్వహణకు రెడీ అయితే ఎస్ఈసీ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదని..ఇందులో ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయనే వారూ ఉన్నారు.

Tags:    

Similar News