చంద్ర‌బాబే ఒక ఉగ్ర‌వాది

Update: 2021-10-27 07:33 GMT

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ప్ర‌భుత్వ ప్రాయోజిత ఉగ్ర‌వాదం న‌డుస్తోంద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే...చంద్ర‌బాబే ఉగ్ర‌వాది అంటూ విజ‌యసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఎందుకు అంటూ ప్ర‌శ్నించారు. పట్టాభి తిట్లను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారా? అనిప్రశ్నించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా తో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి ఢిల్లీ వచ్చారా.. ఏం ప్రయోజనం కోసం వచ్చారు? అంటూ విమ‌ర్శించారు. ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభితో తిట్టించారని ఆరోపించారు. పట్టాభి వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందన్నారు.

''పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు సమర్థిస్తున్నారా? గంజాయి వ్యాపారంలో లోకేష్‌ పాత్ర ఉందని ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రరాష్ట్ర పరువును చంద్రబాబు దిగజారుస్తున్నారని'' విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ''టెర్రరిస్ట్‌ ముఠాకు చంద్రబాబు నాయకుడు. పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బాబు యత్నిస్తున్నాడు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారు?. అమిత్‌షాపై రాళ్లు వేయించిన వీడియో చూపించావా?. మహానాడులో ఆర్టికల్‌ 356 రద్దుపై తీర్మానం చేశారు. ఇప్పుడు అదే ఆర్టికల్‌ ఏపీలో ప్రయోగించాలంటున్నారు. డ్రగ్స్‌ వ్యాపారం చేసింది చంద్రబాబు,లోకేషే. చంద్రబాబు హయాంలో గంజాయిసాగుపై అప్పటి మంత్రి గంటా ఏం చెప్పారో ఆ వీడియో కూడా వినాలని'' విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు సంగ‌తి తెలుసుకాబ‌ట్టే అమిత్ షా ఆయ‌న‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేద‌న్నారు. ఢిల్లీలో చంద్ర‌బాబును ఎవ‌రూ న‌మ్మేప‌రిస్థితి లేఏద‌న్నారు.

Tags:    

Similar News