అమిత్ షాతో విజయశాంతి భేటీ

Update: 2020-12-06 15:35 GMT

మాజీ ఎంపీ విజయశాంతి బిజెపిలో చేరటం ఖరారు అయిపోయింది. ఆమె ఆదివారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. ఆమె సోమవారం నాడు బిజెపి పార్టీ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరతారని సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్న విజయశాంతి చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో బిజెపి అనూహ్యంగా బలం పుంజుకుంటుండటంతో ఆమె తిరిగి బిజెపి గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది కాంగ్రెస్ కీలక నేతలు కూడా కమళదళంలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News