పశ్చిమ బెంగాల్ లో వ్యాక్సిన్ రాజకీయం

Update: 2021-04-23 15:44 GMT

ఎన్నికల వేళ మరోసారి వ్యాక్సిన్ రాజకీయం తెరపైకి వచ్చింది. తాజాగా బిజెపి తాము పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే బిజెపి ప్రకటనను టీఎంసీ ఎద్దేవా చేసింది. బిజెపి మాటలను ఏ మాత్రం నమ్మోద్దని వ్యాఖ్యానించింది. బిజెపివి అన్నీ తప్పుడు హామీలేని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విమర్శించారు.

బీహార్ ఎన్నికల సమయంలో కూడా ఇలాగే హామీ ఇచ్చారని ఇప్పుడు అక్కడ ఏమి చేస్తున్నారో చూడాలని ప్రజలను కోరారు. పశ్చిమ బెంగాల్ లో మిగిలిన రెండు విడతలు పూర్తయ్యే వరకూ బిజెపి ఇలాగే చెబుతుందని ఎద్దేవా చేశారు. సీఎం మమతా బెనర్జీ మాత్రం కేంద్ర వ్యాక్సినేషన్ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది మార్కెట్ శక్తులకు అనుకూలంగా, ప్రజలకు వ్యతిరేకం ఉందని విమర్శించారు.

Tags:    

Similar News