డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్, ఫేస్ బుక్ షాక్

Update: 2021-01-07 04:25 GMT

సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్ బుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు షాకిచ్చాయి. ఆయన ఖాతాలను బ్లాక్ చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టడమే దీనికి కారణం. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఖాతాను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. మరోవైపు ట్విటర్‌ సైతం ట్రంప్‌ చేసిన మూడు ట్వీట్‌లను తొలగించమని కోరుతూ తాత్కాలికంగా ఖాతాను నిలిపివేసింది. అధ్యక్ష ఎన్నికలపైనా, వాషింగ్టన్‌ డీసీలో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల పట్ల ఆధారరహిత వ్యాఖ్యలు చేయడంతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ట్రంప్‌ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలియజేశాయి.

రెండు రకాల పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్‌ పోస్టులు పెట్టడంతో ఖాతాకు తాత్కాలికంగా చెక్‌ పెట్టినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఇదే విధంగా కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ను నియామకాన్ని నిలిపివేయమంటూ ట్రంప్‌ మద్దతుదారులు కాంగ్రెస్‌పై నిరసనలను వ్యక్తం చేస్తున్న అంశంపై ట్విటర్‌ 12 గంటలపాటు ఖాతాను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. ఈ అంశాలపై చేసిన మూడు ట్వీట్‌లను తొలగించవలసిందిగా సూచించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ట్వీట్‌లను తొలగించకపోతే.. ట్రంప్‌ ఖాతా నిలిపివేత కొనసాగుతుందని ట్విటర్‌ పేర్కొంది.

Tags:    

Similar News