జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ హవా

Update: 2020-12-04 07:20 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి రౌండ్ ఫలితాల ప్రకారం చూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీనే హవా కొనసాగిస్తోంది. 12.45 గంటల వరకూ చూస్తే టీఆర్ఎస్ 53 చోట్ల లీడ్ లో ఉండగా, బిజెపి 20 చోట్ల లీడ్ లో ఉంది. ఎంఐఎం మాత్రం 22 చోట్ల ఆధిక్యత చూపుతోంది. పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది. మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించి.. గ్రేటర్‌లో తొలి గెలుపును నమోదు చేసింది. అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు.

ఇక యూసఫ్‌గూడ (రాజ్‌కుమార్‌ పటేల్‌), మెట్టుగూడ (రాసూరి సునీత) డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఎస్‌రావు నగర్‌లో కాంగ్రెస్‌ (శిరీషారెడ్డి) గెలుపొంది. గ్రేటర్‌లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది దీంతోనే. పలుచోట్ల టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. అయితే పోటీ మాత్రం చాలా తీవ్రంగా సాగినట్లు కన్పిస్తోంది. అంతే కాదు..టీఆర్ఎస్ తర్వాత రెండవ స్థానంలో బిజెపినే ఉండటంతో రాబోయే రోజుల్లో రాజకీయాలు మారటం ఖాయంగా కన్పిస్తోంది.

Tags:    

Similar News