రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి డుమ్మా కొట్టిన టీఆర్ఎస్

Update: 2022-01-31 07:33 GMT

అధికార టీఆర్ఎస్ గేర్ మార్చింది. కేంద్రంలోని బిజెపి స‌ర్కారు విష‌యంలో దూకుడు పెంచుతోంది. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు చెబుతోంది. ఆదివారం నాడు టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ సార‌ధ్యంలో జ‌రిగిన పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.అ అందుకు అనుగుణంగానే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే టీఆర్ఎస్ నిరసనలు మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి ఎంపీలు దూరంగా ఉన్నారు.

సోమ‌వారం సాయంత్రానికి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ చేరుకోనున్నారు. విభజన హామీలు, ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయటా పోరాడాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై టీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.

Tags:    

Similar News