మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో చేరతారా?. ఆయనతో మంగళవారం నాడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భేటీ కావటంతో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వచ్చాక దూకుడు పెరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగానే పలు పార్టీలకు చెందిన నేతలు కూడా ఇటువైపు చూస్తున్నారు.
మంగళవారం నాడు రేవంత్ తో వివిధ పార్టీలకు చెందిన నేతలు సమావేశం అయ్యారు. అంతే కాదు వారు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కూడా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పా ర్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పీసీసీ ప్రకటనలో జాప్యం జరుగుతుందనే కారణంగానే ఆయన వైదొలిగారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా కొండా, రేవంత్ భేటీతో ఆయన తిరిగి పార్టీలోకి రావటం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం వ్యక్తం అవుతోంది.