ఏపీ సర్కారుపై ..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తండ్రిని తండ్రిని మించిన దుర్మార్గుడు అని ఆరోపించారు. సమస్యను సృష్టించిందే ఆంధ్రాసర్కార్ అని..ఏపీకి హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు?. సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా . జీవో ల పేరిట చిలకపలుకులు. తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవో ను ఇచ్చారా?. మద్రాస్ కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా నీళ్లను దోచుకున్నారు. సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారు. ఏడేళ్ళ కరువులోను కృష్ణాడెల్టా కు నీళ్లు వదిలారు. ఎడమ కాలువ ఎట్టుమీద కుడికాలువ కింది భాగంలో ఉంది.
హుకుంలు జారీ చేయడం,దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారు. ఆడుకుంటాం,వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణా హక్కుల్ని ఎవరూ హరించ లేరు. చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసం. రైతులు ఎక్కడైనా రైతులే . ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే ముఖ్యమంత్రి కేసీఆర్. ఫార్ములాను పక్కన పెట్టి అహంకారం తో పోతున్నారు. ఇందులో తెలంగాణా ది ఈసం ఎత్తు తప్పు లేదు. తప్పు చేసినోళ్లే లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారు అని మండిపడ్డారు.