నాలుక కోస్తామన్న కెసీఆర్...నాలుక గీయమన్న ఎంపీ అరవింద్
'మెడలు విరిచేస్తాం. నాలుకకోస్తాం. అగ్గిపెడతాం. సన్నాసులు. కళ్లునెత్తికెక్కి మాట్లాడుతున్నరు.కుక్కలు మెరిగినట్లు మెరిగితే ఊరుకునేదిలేదు.నలిపి పారేస్తాం. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. పిచ్చికూతలు కూస్తే చీల్చిచెండాడుతం' అంటూ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం నాడు బిజెపి నేతలపై విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్ గా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ వాడిన మాటల కంటే మరింత దారుణంగా..పరుషమైన భాషతో ఆయన విమర్శలు చేశారు. 'సీఎం కెసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. నిరాశ బాగా పెరిగింది. ప్రజాదరణ కోల్పోతున్న నిరాశతోటి ఒక నీచుడిగా దిగజారిపోయిండు ఇవాళ. తీన్మార్ మల్లన్న లొట్టపీసు అంటే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అదే నేను లొట్టపీసు కేసు అన్నా. కానీ సీఎం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని లొట్టపీసు చట్టం అంటూ వక్రీకరించారు. లొట్టపీసు అన్న మాటపై పోలీసు యంత్రాంగం బెయిల్ రాకుండా డ్రాగ్ చేస్తోంది. నన్ను వెధవ అంటావా. వెధవన్నర వెధవా. కెసీఆర్ తాగుబోతు వెదవ. అసలు నువు ముఖ్యమంత్రివేనా. నీ బతుకుచెడ. మాట్లాడప్పుడు నీకు ఇన్ పుట్ ఇచ్చేవాడు అయినా సక్కంగా ఇవ్వాలి కదా. 2018లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను బలోపేతం చేసిన పార్టీ బిజెపి. తీన్మార్ మల్లన్న భార్య ఓ దళిత యువతి. నువు చేస్తున్న ఎరాస్ మెంట్ ..ఆమె ఫ్యామిలీ కోసం వేధింపుల మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిపించే ఏర్పాటు చేయించా. అది దళితుల మీద నాకు ఉన్న చిత్తశుద్ధి. నువు కూర్చున్న కుర్చీ దళితులది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన కుర్చీ కూడా అదే. క్రిమినల్ బ్రీచ్ ఆప్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలో వేయాలి బిడ్డా. దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోతే మెడలు కోసుకుంటా అన్నావు.
ఇప్పుడు మా నాలుకుల కోస్తా అంటావు ఇవాళ. నాకు రెండు, మూడు రోజుల నుంచి సర్ది అయి నాలుక చప్పబడిపోయింది. నాలుక కోసుడు తర్వాత..నాలుక గీసిపోదువు రా. మాకు చిత్తశుద్ధి నువు నేర్పించాల్సిన అవసరం లేదు తాగుబోతోడా. కెసీఆర్ ఏమి మాట్లాడుతున్నాడు అసలు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా వాళ్లు దంచుతున్నారు. ఎవరిని దంచుతున్నారు. ఎవరు పారిపోయారు. ఎవరి పారిపోయారు భారత సైన్యం పారిపోయింది అంటావు నువు ఇవాళ. ముదనష్టపోడా.తెలంగాణను దోచుకుతింటున్నవు రాక్షసుడా. నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డా తూ మీరు అసలు మనుషులేనా?. ఏమి మాట్లాడుతున్నావు. సన్నాసి..వెధవ, నాలుక చీరేస్తా ఎవరిని అంటున్నావు. బిజెపి కళ్ళు ఎర్రచేస్తే భస్మం అయిపోతావు.' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల గురించి కెసీఆర్ మాట్లాడుతున్నారని..ఆయన సొంత జిల్లాలోనే కెసీఆర్ వచ్చాక వందల సంఖ్యలో రైతులు చనిపోయారని తెలిపారు. ఆర్టీఐ కింద సేకరించిన సమాచారాన్ని ఆయన చూపెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే భాష వాడిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే దేశానికి ఆదర్శంగా ఉండాలంటూ మాట్లాడేవారు. కానీ తాము మాత్రం అవకాశం వచ్చినప్పుడు అల్లా ఇతరులపై పరుష పదజాలంతో విమర్శలు చేసి..తర్వాత మాత్రం అవతలి వ్యక్తులు చేసిన విమర్శలను మాత్రం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేసేవారు. సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్యలను మించి బిజెపి ఎంపీ అరవింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరి వీటిపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.