తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రాజ్యసభలో రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీ, తెలంగాణాను మళ్లీ కలపాలనే కుట్ర కన్పిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిలో గుజరాత్ ను మించి పోతుండటంతో మోడీకి ఏ మాత్రం మింగుపడటం లేదన్నారు. మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని..అప్పటివరకూ బిజెపి నేతలను రాష్ట్రంలో తిరగనివ్వబోమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇన్నేళ్లు మోడీ గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో ఎస్పీ గెలుస్తుందని వస్తున్న సర్వేలు చూసి మోదీ డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు.