కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి హై కమాండ్ షాక్

Update: 2022-10-23 08:50 GMT

ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షాక్ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తమకు అందిన పిర్యాదు పై పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ఏఐసీసీ క్రమశిక్షణ సంఘము సభ్య కార్యదర్శి తారిఖ్ అన్వర్ ఈ నోటీసు జారీ చేశారు . తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణికం ఠాగూర్ తన దృష్టికి ఈ కంప్లైంట్ తీసుకొచ్చారని ..అందులో కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కి వ్యతిరేకముగా, తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓటు వేయాలని కోరినట్లు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రాధమికంగా వెంకటరెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించినట్లు గుర్తించామని ..అందుకే నోటీసు జారీ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ పరిణామం పై వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయన విదేశీ టూర్ లో ఉన్నారు. ఇక ఇదే ఛాన్స్ అని కాంగ్రెస్ పార్టీ కి ఝలక్ ఇస్తారా అన్నది వేచిచూడాల్సిందే. తొలుత వెంకట రెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్ మీడియా లో వైరల్ కాగా..తర్వాత విమానాశ్రయంలో మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News