సీపీఎస్ హామీ ఇచ్చిన‌ప్పుడు మాకూ తెలియ‌దు

Update: 2021-12-14 13:58 GMT

స‌జ్జ‌ల మాట‌ల‌తో ఆ హామీ అట‌కెక్కిన‌ట్లేనా?!

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీపీఎస్ ఆ రోజు హామీ ఇచ్చిన‌ప్పుడు ఒక అపొజిష‌న్ లీడ‌ర్ గా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ల ప‌రిస్థితి ఏంటి అనే దానిపై ఇచ్చారు. అంతే కానీ సాంకేతిక అంశాలు చూడ‌లేదు. ఎందుకంటే అవేమీ మాకూ తెలియ‌దు. ఇప్పుడు ఇక్క‌డ‌కు వ‌చ్చి చూస్తే అన్ని ర‌కాలుగా ఫైనాన్స్ కానీ..అన్ని అంశాలు పరిశీలిస్తే మొత్తం బ‌డ్జెట్ అంతా కూడా సరిపోయేట్లు లేదు. ఫిగ‌ర్స్ కూడా ఉన్నాయి. దాంతో మ‌ళ్లీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ఏమి చేయాల‌ని అంటూ వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట‌లు చూస్తే సీపీఎస్ ర‌ద్దు అనేది జ‌రిగే ప‌ని కాద‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన‌ట్లు క‌న్పిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి మంగ‌ళ‌వారం నాడు ఉ్య‌దోగుల అంశంపై మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ అంశాన్ని ప్ర‌స్తావించారు.

ఆయ‌న పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘ నేత‌ల‌తో విడివిడిగా స‌మావేశం అయిన వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని.. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల అన్నారు. పట్టు విడుపులు అటూ ఇటూ ఉండటం స‌హ‌జ‌మేఅన్నారు. ఇదిలా ఉంటే జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా తాము అధికారంలోకి వ‌స్తే నెల రోజుల్లోనే సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మేనిఫెస్టోలో కూడా పెట్టారు.

Tags:    

Similar News