తెలంగాణ సర్కారుపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తప్పుపట్టారు. ఇది ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శమన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'దేశంలో ఉత్పత్తి పెరిగి,తక్కువ ధరకే విద్యుత్ లభిస్తోన్న పరిస్థితుల్లో వినియోగదారులకు ఛార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపడం మీ అసమర్ధతకు నిదర్శనమా?. మీ పాలనలో పతనమైన వ్యవస్థల దుష్ఫలితమా?. పెట్రో ఉత్పత్తుల పై నువ్వు వేసే పన్ను ఆర్టీసీ వెన్ను విరిచిందన్నది వాస్తవం కాదా, కేసీఆర్!' అని ప్రశ్నించారు.