జూన్ 7 తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే సంగతి తమ క్యాడర్ తేలుస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీ తాట తీయిస్తా అంటూ హెచ్చరించారు. వాళ్లు చెప్పులతో కొట్టడంతో కాదని..వాళ్లకు చెప్పుల దండలు తప్పవన్నారు. గ్రామాల్లోకి వస్తే తమ పార్టీ కార్యకర్తలే ఈ పని చేస్తారని హెచ్చరించారు. ఇంత కాలం తమ పార్టీ నాయకులు చాలా మర్యాదతో వ్యవహరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారిన వాళ్లను రాళ్ళతో కొట్టాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వారెవరూ ఇవాళ కెసీఆర్ కేబినెట్ లో లేరన్నారు. పార్టీ మారిన వారంతా రద్దు అయిన వెయ్యి రూపాయల నోట్ల వంటి వారన్నారు. చీము, నెత్తరు ఉంటే పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగాలన్నారు. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు.