గజ్వేల్ వస్తున్నా...ఎవడు అడ్డుకుంటారో రండి..తొక్కేస్తా
దొంగ దొరికాడు..హుజూరాబాద్ లోచూస్కోండి
రెండుసార్లు సీఎం చేసిన ప్రజలకు కెసీఆర్ చర్మంతో చెప్పులు కుట్టినా తక్కువే
దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇచ్చి హుజూరాబాద్ లో దళితుల ఇళ్ళపై టీఆర్ఎస్ జెండా, ఇంట్లో కెసీఆర్ ఫోటో పెట్టాలంటే మాత్రం లాగులు ఊడేదాకా కొట్టాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పది లక్షల రూపాయలు ఇస్తేనే కెసీఆర్ ఫోటో, టీఆర్ఎస్ జెండాలు పెట్లాలంటే రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ప్రజలకు కెసీఆర్ ఏమి చేయాలన్నారు. తెలంగాణ ప్రజలు నీకు ముఖ్యమంత్రి పదవి, నీ కొడుకుకు మంత్రి పదవి, నీ అల్లుడికి మంత్రి పదవి, నీ షడ్డకుడి కొడుకు రాజ్యసభ ఇచ్చినందుకు వారికి నువు చర్మం వలిచి చెప్పులు కుట్టినా తప్పులేదంటూ కెసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ దత్తత గ్రామం మూడు చింతల పల్లిలో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హూజూరాబాద్ ఉప ఎన్నికల ద్వారా దొంగ మీ చేతికి దొరికాడు..ఎలా చేస్తారో అంతా మీ చేతుల్లోనే ఉందన్నారు. నిన్న ఓ సన్నాసి మీడియా సమావేశం పెట్టి గజ్వేల్ కు ఎలావస్తాడో చూస్తా అని మాట్లాడుతున్నాడని..కొడకల్లారా సిద్ధంగా ఉండండి. వచ్చే నెలలోనే గజ్వేల్ కు వస్తున్నా. మీ కులపోళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న వారిని ఎవరిని పిలిపించుకుంటారో పిలిపించుకోండి అంటూ సవాల్ విసిరారు. గజ్వేల్ గడ్డ మీద కాలు పెడతా..అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేస్తా అంటూసవాల్ విసిరారు. అడ్డం వచ్చిన వాడిని తొక్కుకుంటూ పోతా..లేకపోతే గుండు కొట్టించుకుంటా. నా కొడకల్లారా..రండి..మీ అంతు చూస్తా..లఫూట్ నాకొడుకులతో తిట్టిస్తే ఊరుకుంటామనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో యువత చనిపోయింది సన్నబియ్యం, చేపపిల్లల కోసమా? అని ప్రశ్నించారు. కెసీఆర్ మనవడు ఏ బడిలో చదువుతున్నడో అక్కడే దళితులు, గిరిజను, ఇతర కులాల పిల్లలు కూడా చదవాలి. రాజ్యాధికారంలో కూడా ప్రజలు వాటా ప్రకారం పదవులు దక్కాలన్నారు. ఈ సమావేశంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'తెలంగాణ వచ్చాక ప్రజాప్రతినిధులు..సర్పంచులు బానిసలు గా బతుకుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలు అనాథలు అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ముసుగులో పార్టీని బలోపేతం చేసుకున్నావు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి హుజూరాబాద్ లో కుటుంబానికి పది లక్షల రూపాయలు అంటున్నాడు. జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ల నిధులు వాళ్లకే అని కాంగ్రెస్ పార్టీ చట్టం తెచ్చింది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పూర్తిగా ఆగిపోయాయి. రాష్ట్రంలోని దళిత, గిరిజన ప్రజలకు దళిత బంధు ఇప్పించాల్సిన బాధ్యత హుజూరాబాద్ దళిత కుటుంబాలపైనే ఉంది. కెసీఆర్ ఇచ్చింది అన్నీ తీసుకోండి. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోకుండి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ లబ్దిదారులు జాబితా సిద్ధం చేసి..ఎన్నికలు అయ్యాక ఇస్తానంటున్నాడు. కెసీఆర్ సర్పంచ్ బుద్దులు పోలేదు. ఇప్పటికే 15 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు.
అయినా తెలంగాణ పల్లెలు కన్నీరు కారుస్తున్నాయి. రాష్ట్రంలో కన్నీరు పెట్టని ప్రజలు లేరు. గజ్వేల్ పాంహౌస్ నుంచి తెలంగాణ తల్లిని విడిపించాల్సిన అవసరం ఉంది. గ్రామ సర్పంచ్ లు అప్పులు చేసి..అప్పులు కట్టలేక అత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. సర్కారు బిల్లులు చెల్లించటం లేదు. దరణి వెబ్ సైట్ లో అసలు కెసీఆర్ దత్తత గ్రామం లక్ష్మాపూర్ గ్రామమే లేదు. కాంగ్రెస్ సభ ఉందని కొంత మంది సన్నాసులు అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. ఓరి సన్నాసుల్లారా..ఈ గ్రామాల్లో 57 ఏళ్లు నిండిన వారికి ఎంత పెన్షన్లు ఇచ్చారు. ఎవరి ఇంట్లో డబ్బులతో ఇళ్లు ఇచ్చారు. అన్ని కులాలకు కమ్యూనిటి హాళ్లు కట్టిస్తామన్నారు. ఏడేళ్ళు అయినా కూడా ఏమీ కట్టలే. కొత్త ఇళ్లు కట్టిస్తానని..ఇళ్లు కూలగొట్టారు. ఆడపిల్లలు స్నానం చేయటానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. పక్కింటి పొకిరి నా కొడుకులు తొంగి చూస్తుంటే..దీనికి బాధ్యుడు తాగుబోతు కెసీఆర్ కాదా? అని ప్రశ్నించాలి. కెసీఆర్ ను వంగ పెట్టి చెప్పుతో కొట్టాలి అన్పించింది.' అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.