టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం నాడు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత వి. హనుమంతరావును పరామర్శించారు. టీపీసీసీ ప్రకటన వెలువడిన తర్వాత సీనియర్లు అందరినీ కలుస్తానని రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన మాజీ పీపీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్యతో కూడా భేటీ అయ్యారు.
ఆ తర్వాత అపోలో ఆస్పత్రికి వెళ్ళి విహెచ్ ను పరామర్శించారు. రేవంత్ కు పీపీసీ పదవి ఇవ్వటాన్ని విహెచ్ గట్టిగా వ్యతిరేకించారు. ఆయన తన అభిప్రాయాన్ని పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపర్చారు. కానీ అధిష్టానం ఎవరెన్ని మాటలు చెప్పినా రేవంత్ వైపే మొగ్గుచూపి శనివారం రాత్రి రేవంత్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.