రేవంత్ రెడ్డి తనకు పీసీసీ పదవి రావటంలో కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డి కె శివకుమార్ కూడా ఓ మాట సాయం చేశారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉత్సాహంగా పనిచేసే యువకులకే అవకాశం ఇవ్వాలని శివకుమార్ తో పాటు పలువురు సూచించారన్నారు. మొదటి నుంచి రేవంత్, శివకుమార్ ల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ నెల7న పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా శివకుమార్ ను ఆహ్వానించారు. జూన్ 7న పెద్ద ఎత్తున అభిమానులతో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.