పార్లమెంట్ సమావేశాలు ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పెగాసెస్ వ్యవహారంతోపాటు రైతు బిల్లులు తదితర అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. మంగళవారం నాడు రాహుల్ గాంధీతోపాటు పలువురు విపక్ష పార్టీల ఎంపీలు సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు.
పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ వీరు ఈ కార్యక్రమం చేపట్టారు. అందుంలో భాగంగానే టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లారు. ఆ సైకిల్ పై పెట్రోల్, గ్యాస్ ధరల ప్లకార్డును ఉంచారు. అంతకు ముందు రాహుల్ గాంధీ విపక్ష నేతలతో సమావేశం అయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.