సీనియర్ ల కోరిక మేరకు ఇంచార్జి ని మార్చటం తో సీనియర్ లు గా చెప్పుకుంటున్నవారు ఇప్పుడు అంతా కలిసి పనిచేయాల్సిన పరిస్థితీ. మరి ఇప్పటికైనా వీరిలో మార్పు వస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. రేవంత్ రెడ్డి తాజా గా తన వ్యాఖల ద్వారా బాల్ ను బయటకు కొట్టారు. ఇప్పటికి సీనియర్లు కలిసిరాకపోతే వాళ్ళకే అది ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలాకాలంగా అధికార పార్టీ పై పోరాడాల్సిన కాంగ్రెస్ సీనియర్లు సొంత పార్టీ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలకాలంలో ఇది పీక్ కి వెళ్లటంతో కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపి నివేదిక తెప్పించుకుంది. దీనిపై యాక్షన్ కూడా ప్రారంభం అయింది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఇంచార్జి గా ఉన్న మాణిక్యం ఠాగూర్ ప్లేస్ లో కొత్తగా మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ను నియమించారు. రేవంత్ రెడ్డి పై కూడా ఎవరిని కలుపుకు పొరనే విమర్శలు ఉన్నాయి. అయన పీసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూడడం ఆయనకు కొంత మైనస్ గా మారింది. రెండు సార్లు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే పీ ప్రెసిడెంట్ లు ఉన్నా సమయంలో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో ఫెయిల్ అయిన సీనియర్ నేతలు ఇప్పుడు మాత్రం ఒరిజినల్ నేతలు..వలస నేతలు అంటూ కొత్త రాగం అందుకున్నారు.