రాజీనామా చేస్తా...అన‌ర్హ‌త వేటు వేయాల‌ని చూస్తున్నారు

Update: 2022-01-07 07:57 GMT

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని చూస్తున్నార‌ని..తానే వారికి వారం రోజుల స‌మ‌యం ఇస్తున్నాన‌న్నారు. లేక‌పోతే రాజీనామా చేసి మ‌ళ్లీ గెలుస్తాన‌ని ప్ర‌క‌టించారు. ర‌ఘురామ‌క్రిష్ణంరాజు శుక్ర‌వారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. త‌న ఎన్నిక ద్వారా అయినా వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి ప‌ట్టిన ద‌రిద్రాన్ని వ‌దిలిచేందుకు..అమ‌రావ‌తే రాజధానిగా ఉండాల‌నే అంశంపై పోరాటం చేస్తాన‌న్నారు. ర‌ఘురామ‌క్రిష్ణంరాజు గ‌త కొన్ని రోజులుగా వైసీపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆ పార్టీ కూడా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ ప‌లుమార్లు స్పీక‌ర్ ఓం బిర్లాకు పిర్యాదు చేశారు. అన‌ర్హ‌త త‌ప్ప‌ద‌నే ఉద్దేశంతోనే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News