మరోసారి ఏపీ సర్కారు. ఎస్ఈసీ మధ్య వివాదం రాజుకుంది. ఇతర ఎన్నికల తరహాలోనే ఎస్ఈసీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా కారణాలేంటో తెలియదు కానీ ఎస్ఈసీ మాత్రం ఈ ఎన్నికల నిర్వహణపై ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఆదేశాల మేరకు గురువారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం నోటీసులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి ఈ నోటీసులు జారీ చేశారు. మంత్రి ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే నోటీసులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే ఎస్ఈసీ రమేష్ కుమార్ తన సెలవులను రద్దు చేసుకుని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఇప్పటికే రమేష్ కుమార్ ఎల్ టీసీ పై వెళ్ళేందుకు సెలవు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆయన సెలవు రద్దు చేసుకుని ప్రివిలైజ్ కమిటీ కోరినట్లు అందుబాటులో ఉంటారా?. లేక తాను ముందు అనుకున్నట్లు సెలవును ఉపయోగించుకుంటారా అన్నది వేచిచూడాల్సిందే.