
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మీకెవరికీ తెలియదు. ఆయన డబ్బులు తీసుకుని పనిచేయడు. ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకుని పనిచేసినట్లు ఆధారాలు ఉన్నాయా?. చూపించగలరా?' అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ అనంతరం కెసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని..ఆయన అంటే ఎందుకు భయం అని ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం ప్రశాంత్ కిషోర్ తో కలసి పనిచేస్తానన్నారు. మీకు తెలుసా? ఏడేళ్లుగా నాకు ప్రశాంత్ కిషోర్ స్నేహితుడు అని కెసీఆర్ తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ బాగా ఇన్ డెప్త్ గా సర్వేలు చేసి మంచి నివేదికలు ఇస్తుందని తెలిపారు. ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదన్నారు. 2018లో ఎన్నికలకు అప్పటి పరిస్థితులను బట్టి వెళ్ళామని..ఇప్పుడు ఇక్కడ అంతా సాఫీగా సాగుతుందని..ఇప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఏమీ తెలియని వాళ్లే ఏది పడితే అది మాట్లాడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సట్లు గెల్తుస్తాం అని కెసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 చోట్ల టీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని అన్నారు.