అమ్మవారు కళ్లుతెరిచినందుకే చంద్రబాబుకు ఈ స్థితి

Update: 2021-03-07 09:19 GMT

విజయవాడలో ఆదివారం నాడు అధికార వైసీపీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన విమర్శలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు అందరూ వదిలేశారని..చివరకు కార్యకర్తలు పట్టించుకోవటంలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు, ఆయన శ్రీమతి, కొడుకు మాత్రమే ఉన్నారన్నారు. విజయవాడ అమ్మవారు కళ్లు తెరిచింది కాబట్టే చంద్రబాబుకు ఈ బతుకు వచ్చిందని పేర్ని నాని మండిపడ్డరు. 'కొబ్బరి చిప్పలోడిని పక్కన పెట్టుకుని మాట్లాడతావు నువ్వు. మానసిక ప్రశాంతత లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. కార్యకర్తలు కూడా మిమ్మల్ని వదిలేసి స్థితికి వచ్చావు. కుక్క చావుకు వచ్చింది. క్షుద్ర పూజలు చేస్తే అమ్మవారు సహిస్తుందా?.అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పటికైనా స్వచ్చమైన రాజకీయాలు చేస్తే మంచిది. అమరావతిలో మీరు ఏమి చేశారు.

చెంబుడు నీరు..మట్టి పోగేసినంత మాత్రాన అంతా అయిపోయందా. వేల కోట్లు పెట్టి కారిపోయే తాత్కాలిక భవనాలు కట్టారు. బయట వర్షం వస్తే అదే స్థాయిలో అసెంబ్లీలో కూడా వర్షం పడుతుంది. ప్రజల డబ్బులు పెట్టి అటు వంటి భిల్డింగ్ లు కట్టారు. అదే రాజధాని బెజవాడలో..గుంటూరులో కట్టి ఉంటే ఎంత బాగుండేది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. తెలంగాణలో దొంగతనం చేసి..పారిపోయి ఇక్కడకు వచ్చాడు. . బెజవాడలో ఒక్క బైపాస్ నిర్మాణం చేశారా?. కేంద్ర ప్రభుత్వం ఒక వంతెన మంజూరు చేస్తే..ఐదేళ్ళలో కట్టడం చేతకాని మీరు ఇప్పుడు ఏదో బెజవాడను ఉద్దరస్తానంటావు. ఒక వంతెన నిర్మాణం చేయలేకపోయావు. చంద్రబాబుకు అధికారం అంటే ప్రేమ. దోచుకోవటం..హెరిటేజ్ లో దాచుకోవటం. అదే ఆయనకు తెలిసింది.

మహానగరాన్ని నిర్మిస్తానని గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారు. ఎంతో చేశానని చెప్పుకునే అమరావతిలో కర్ర పట్టుకుని బాదారు. ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మోసం మోసం...చంద్రబాబుకు తెలిసింది అదే. చంద్రబాబు హయాంలో నే అడ్డగోలుగా పన్నులు పెంచారు. పరిపాలనా పరంగా జగన్ ను ఏమీ అనలేక ఇలాంటి తప్పుడు విమర్శలు చేస్తున్నారు. ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నావు. దేశంలో ఎక్కువ పాపాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. ప్రభుత్వంలో ఉండి పాపాలు చేసి దోచుకున్నారు. భూములు దోచుకోవటంపై ఉన్న శ్రద్ధ ఇతర అంశాలపై ఏమీ లేకుండా పోయింది. స్వస్తిక్ తో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. అధికారం పోయిన ప్రతిసారి మారతాడు చంద్రబాబు. అధికరాంలోకి సవ్తే మాత్రం నక్కజిత్తులు వేస్తాడు. ఎన్నిసార్లు మారతావు అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News