హుజూరాబాద్ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎవరికి వారు తమ తమ వ్యూహలను అమలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసి..సస్పెండ్ అయిన నియోజకవర్గ ఇన్ ఛార్జి పాడి కౌశిక్ రెడ్డి బుధవారం నాడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
ఆయనతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు, ద్వితియశ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. కౌశిక్ టీఆర్ఎస్లో చేరితే ఉపఎన్నికలో ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇస్తారా..? ఇవ్వరా..? అనే విషయం తేలాల్సి ఉంది. తనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారు అయిందని చెప్పిన కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ కలకలం రేపిన విషయం తెలిసిందే.