లా కమిషన్ కు జమిలి ఎన్నికల ప్రతిపాదన

Update: 2021-02-10 15:57 GMT

ఒకే దేశం..ఓకే ఎన్నికపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ గత కొంత కాలంగా జమిలి ఎన్నికల అంశాన్ని తరచూ లేవనెత్తుతున్నారు. లోక్ సభతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదనను అత్యంత కీలక దశకు చేరింది. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం లా కమిషన్ కు సిఫారసు చేశారు. ఈ ప్రతిపాదన అమలు చేయదగ్గ రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా న్యాయ కమిషన్ ను కోరారు.

ఈ అంశానికి సంబంధించి ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కమిషన్ తోపాటు వివిధ భాగస్వామ్యపక్షాలతో చర్చించినట్లు కేంద్రం లోక్ సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించింది. ఈ కమిటీ తన 79వ నివేదికలో పలు సిఫారసులు చేసిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగటం వల్ల అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని ప్రధాని నరేంద్రమోడీ పలుమార్లు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News