అలా కోరుకునే వాళ్ళు అందరూ రావాలి

Update: 2023-02-24 15:56 GMT

Full Viewటీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు హలో లోకేష్ కార్యక్రమం లో యువత నుంచి ఒక ఆసక్తి కరమైన ప్రశ్న ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అంటూ సభికుల నుంచి ఒక ప్రశ్న వచ్చింది. దీనిపై స్పందించిన నారా లోకేష్ ...నూరుకు నూరు శాతం..ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో..ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి..ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్ళాలి. ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళు అందరూ రాజకీయాల్లోకి రావాలి అంటూ లోకేష్ స్పందించారు.లోకేష్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన సమయంలో అక్కడ ఉన్న యువత పెద్ద పెట్టున కేకలు వేశారు.

                              అదే సమయంలో పవన్ కళ్యాణ్ పేరును కూడా లోకేష్ ప్రస్తావించారు. 2014లో పవన్ మంచి మనసును చూశానన్నారు. నారా లోకేష్ జనవరి 27 నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఓడిపోతేనే ఆంధ్ర ప్రదేశ్ కు పరిశ్రమలు పరుగెత్తుకుంటూ వస్తాయన్నారు. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా నేడు ఆటోడ్రైవర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలని అన్నారు

Tags:    

Similar News