కెటీఆర్ పై బండి సంజ‌య్, రాజాసింగ్ లు ఫైర్

Update: 2021-12-25 08:09 GMT

హిందూ దేవ‌త‌ల‌ను త‌న షోల ద్వారా అవ‌మానించే స్టాండ్ అప్ క‌మెడియ‌న్ మున్నావ‌ర్ ఫారుఖీని మంత్రి కెటీఆర్ తెలంగాణ‌కు ఆహ్వానించ‌టంపై బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు మున్నావ‌ర్ పారుఖీని నిషేధిస్తే.. కేటీఆర్ మాత్రం ఇక్క‌డ‌కు ఆహ్వానించారన్నారు. దుర్గమ్మ, రాముడు, సీతను విమర్శించే వ్యక్తులను సమావేశాలను పెట్టుకునేందుకు ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. కేటీఆర్ ఒక నాస్తికుడన్నారు. ''ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నీ కొడుకును భక్తుడిగా మార్చు' అంటూ బండి సంజ‌య్ హితవుపలికారు.

యువ మోర్ఛా కార్యకర్తలు మున్నావర్ ఫారుఖీని అడ్డుకోవాలని సంజయ్ పిలుపునిచ్చారు. రాజాసింగ్ మరింత తీవ్ర ప‌ద‌జాలంతో మున్నావ‌ర్ పై మండిప‌డ్డారు. అత‌డిని కుక్క‌తో పోలుస్తూ అలాంటి వ్య‌క్తిని ఆహ్వానిస్తారా అంటూ మండిప‌డ్డారు. జ‌న‌వ‌రి 9న హైద‌రాబాద్ కు మున్నావ‌ర్ ను హైద‌రాబాద్ కు ఆహ్వానించార‌న్నారు. తెలంగాణాలో హిందూ దేవీ, దేవ‌త‌ల‌ను తిడితే కూడా ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే సంకేతాల‌ను కెటీఆర్ ఇవ్వ‌ద‌ల‌చారా అని ప్ర‌శ్నించారు. మున్నావ‌ర్ ఫ‌రూఖ్ ని తెలంగాణాకు ఆహ్వానిస్తే త‌రిమిత‌రిమి కొడ‌తామ‌న్నారు.

Tags:    

Similar News