తొడ‌గొట్టి రేవంత్ కు ఛాలెంజ్ విసిరిన మ‌ల్లారెడ్డి

Update: 2021-08-25 13:22 GMT

తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా మంత్రి మ‌ల్లారెడ్డి తొడ‌గొట్టారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మూడు చింతలపల్లి లో దీక్ష సందర్భంగా రేవంత్ త‌న‌పై చేసిన విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న ఘాటుగా స్పందించారు. 'రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, బట్టెబాజ్, దొంగ. నేను పాలు అమ్మితే తప్పా. నీలాగా దొంగ పనులు చేసి సంపాదించలేదు. ఒక ద‌రిద్రపు మొకపోడు రేవంత్ రెడ్డి. ఇప్పుడే సీఎం అయినట్టు కలలు కంటున్నాడు. బుద్ది లేని మనిషి రేవంత్ రెడ్డి.ఈయన ఎం చేశాడని రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తారు. మూడు చింతలపల్లి లో 62కోట్ల రూపాయల తో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశాం. మూడు చింతల పల్లి అనే కొత్త మండలం ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. మూడు చింతలపల్లి లో సమస్యలు లేవు కాబట్టే రేవంత్ ను రావొద్దు అని ప్లకార్డులు చూపించారు. మూడు చింతలపల్లి లో ఉన్న అభివృద్ధి కొడంగల్ లో ఉందా?. మల్లారెడ్డి ఎపుడూ బ్రోకర్ దందా చెయ్యలేదు. నేను లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నా. బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. మల్లారెడ్డి కాలేజీల పై పార్లమెంట్ లో రేవంత్ అడుగీతే కేసులు లేవని క్లిన్ చిట్ ఇచ్చింది. నేను కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలి.

రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు ఫస్ట్ సంతకాలు అని వాగ్ధానాలు చేస్తుండు. తెలంగాణ లో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా. కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిన పార్టీ. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రేస్ చేసిన అభివృద్ధి ఏంటో రేవంత్ చెప్పాలి. రేవంత్ రెడ్డి మూఢుచింతల పల్లి సభ పెట్టినందుకు దళితులు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి ఖబడ్ధార్ ఇక రేపటి నుంచి చూసుకుంటా. మల్లారెడ్డి భూములను జేబులో పెట్టుకోని తిరుగుతలెను- కంప్యూటర్ లో చూస్తే అసైన్డ్ ల్యాండా? కాదా అని తెలుస్తది కావాలంటే రేవంత్ చూసుకోవాలి. ఇద్దరం రాజీనామా చేద్దాం. రేవంత్ రెడ్డి ఎంపీగా మళ్లా గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా' అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి మ‌ల్లారెడ్డి ఊగిపోతూ విలేక‌రుల స‌మావేశంలో రేవంత్ పై మండిప‌డ్డారు.

Tags:    

Similar News