మహారాష్ట్రలో మరోసారి లాక్ డౌన్ విధించే ఛాన్స్ లేదని ముఖ్యమంత్రి ఉథ్థవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అయితే ప్రజలు మరో ఆరు నెలల పాటు విధిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. కేసుల సంఖ్య ఒకింత తగ్గినా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ.. '' నివారణ కంటే ముందు జాగ్రత్త ఎంతో ఉత్తమం.
పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ లను ధరించటం అలవాటుగా మారాలి. నైట్ కర్ఫ్యూలు విధించాలని, వీలైతే మరో లాక్‌డౌన్ పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే అది నాకు ఇష్టం లేదు. అంతా కాకపోయినా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి'' అని అన్నారు.