పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ లో ఓటమి పాలయ్యారు. తొలుత ఆమె 1200 ఓట్లతో గెలుపొందినట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా మమతాపై బిజెపి అభ్యర్ధి సువేందు అధికారి 1622 ఓట్లతో గెలుపొందారు. ఇది అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. బెంగాలో అధికార టీఎంసీకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టిన మమతకు ఈ ఓటమి షాక్ గానే పరిగణించాలి. అంతే కాదు..నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు మమతా బెనర్జీ మీడియాతోమాట్లాడుతూ వ్యాఖ్యానించారు.