అవును..మద్రాస్ హైకోర్టు చెప్పింది నిజమే

Update: 2021-04-26 13:11 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సీఈసీపై మండిపడ్డారు. సీఈసీ బిజెపి గూటి చిలకగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏడో దశ ఎన్నికలు పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 29తో తుది దశ పోలింగ్ పూర్తి కానుంది. మమతా బెనర్జీ సోమవారం నాడు తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఓ ప్రచార సభలో మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు ఎన్నికల సంఘంపై చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ స్వాగతించారు.

ఎన్నికల సంఘం తీరుపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని కోర్టు స్పష్టంగా చెప్పింది. కరోనా కేసులు పెరగడానికి కారణం అదే' అని మమత బెనర్జీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యులని పేర్కొన్నారు. ఎన్నికలు త్వరగా ముగించాలని తాము ఎన్నికల సంఘానికి చెప్పినా వినిపించుకోలేదని మమత గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని పేర్కొన్నారు.

Tags:    

Similar News